చిరు వ్యాపారస్తుల జీవితాలు మారుస్తా

కావలిలో చిరు వ్యాపారస్తుల మున్సిపల్ దుకాణాలు ప్రారంభం

ఒక్కొక్క దుకాణానికి డిపాజిట్ రూ. ఒక లక్ష, నెల అద్దె రూ.5వేలు

పట్టణంలోనీ ట్రంక్ రోడ్డులోనూ మున్సిపల్ దుకాణాలు నిర్మిస్తామన్న ఎమ్మెల్యే

చిరు వ్యాపారస్తుల జీవితాలు మారుస్తా – ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

  • కావలిలో చిరు వ్యాపారస్తుల మున్సిపల్ దుకాణాలు ప్రారంభం
  • ఒక్కొక్క దుకాణానికి డిపాజిట్ రూ. ఒక లక్ష, నెల అద్దె రూ.5వేలు
  • పట్టణంలోనీ ట్రంక్ రోడ్డులోనూ మున్సిపల్ దుకాణాలు నిర్మిస్తామన్న ఎమ్మెల్యే


కావలి- ఉదయగిరి రోడ్డులో చిరువ్యాపారస్థులకు నిర్మించిన దుకాణ సముదాయాన్ని కావలి ఎమ్మెల్యే ప్రారంభించారు. చిరు వ్యాపారస్తుల జీవితాలను మారుస్తానని ఆయన హామీ ఇచ్చారు.


నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో చిరు వ్యాపారస్తుల జీవితాలను మారుస్తానని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. కావలి పట్టణం వెంగళరావునగర్ వద్ద కావలి- ఉదయగిరి రోడ్డులో చిరువ్యాపారస్థులకు నిర్మించిన దుకాణ సముదాయాన్ని కావలి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టకూటికోసం చిరు వ్యాపారస్తులు ఎండనక, వాననక రోజంతా కష్టపడతారని, వారికి ప్రభుత్వ పరంగా అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్డు వెంబడి ఆక్రమణల పేరుతో నిత్యం వారు అనేక ఇబ్బందులు పడకుండా, తాను ఎమ్మెల్యే అయ్యేనాటికి ఎవరైతే రోడ్డు మార్జిన్ లో ఉన్నారో వారికి పూర్తిస్థాయి హక్కులు కలిగేలా మున్సిపాలిటీ నుంచి దుకాణం నిర్మించి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇదే విధంగా ట్రంక్ రోడ్డులో కోర్టు వద్ద, తహశీల్దారు, ఆర్డీవో, ఆర్ అండ్ బి కార్యాలయాల వద్ద దుకాణాలను అంచలంచెలుగా నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *