దంపూరులో స్మశాన వాటికనే ఆక్రమించేశారు
గ్రామ నాయకుడు శ్రీధర్ నాయుడు ఆధ్వర్యంలో స్మశాన వాటిక శుభ్రం
ప్రశాంతమ్మ అక్రమార్కులపై చర్యలు తీసుకోండి…
- దంపూరులో స్మశాన వాటికనే ఆక్రమించేశారు
- గ్రామ నాయకుడు శ్రీధర్ నాయుడు ఆధ్వర్యంలో స్మశాన వాటిక శుభ్రం
ముళ్ల పొదలు, చెత్తాచెదారాలతో నిండిపోయిన స్మశాన వాటికను గ్రామ నాయకుడు కొమ్మి శ్రీధర్ నాయుడు ఆధ్వర్యంలో శుభ్రం చేశారు. స్మశాన వాటికను ఆక్రమించిన అక్రమార్కులపై ఎమ్మెల్యే వేమిరెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు.
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు…విడవలూరు మండలం దంపూరు గ్రామంలోని స్మశాన వాటికను గ్రామ నాయకుడు కొమ్మి శ్రీధర్ నాయుడు ఆధ్వర్యంలో శుభ్రం చేయించారు. మరణించిన వారి అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఉద్దేశంతోనే స్మశాన వాటికను బాగు చేయించడం జరిగిందని శ్రీధర్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….దంపూరు గ్రామంలో ఉన్న స్మశాన వాటికను కొందరు అక్రమార్కులు ఆక్రమించుకుని ఉన్నారని… దీనిపై మండల అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని స్మశాన వాటికను ఆక్రమించిన అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు…స్మశాన వాటికను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జయశంకర్, పంచమూర్తి ధనప్రసాద్, పసుమర్తి ప్రభాకర్,తలారి అరుణ్,సుమంత్,అభిలాష్ పాల్గొన్నారు.