శాస్త్రోక్తంగా కామాక్షితాయి అంకురార్పణ

అంకురార్పణతో ప్రారంభమైన అమ్మణ్ణి బ్రహ్మోత్సవాలు

ఈ ఏడాది ఉత్సవాలు వైభవంగా

శాస్త్రోక్తంగా కామాక్షితాయి అంకురార్పణ

  • అంకురార్పణతో ప్రారంభమైన అమ్మణ్ణి బ్రహ్మోత్సవాలు
  • ఈ ఏడాది ఉత్సవాలు వైభవంగా


అంకురార్పణతో జొన్నవాడ కామాక్షితాయి వార్షిక బ్రహ్మోత్సాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 17వతేదీ నుంచి 27వతేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.

ప్రపంచంలోని ఐదు ప్రసిద్ధ అమణ్ణి ఆలయాల్లో‌ ఒక్కటైనా జొన్నవాడ కామాక్షితాయి వార్షిక బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో వైభవంగా ప్రారంభమయ్యాయి.. ఆలయంలో గణపతిపూజ, పుణ్యహ వచనం నిర్వహించి.. కలశారాధనను గావించారు. అనంతరం వాస్తు శాంతి, వాస్తు హోమం నిర్వహించి.. అంకుర్పాణ కార్యక్రమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.. జొన్నవాడ కామాక్షితాయి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 17 నుండి 27వ తేదీ వరకు జరుగనున్నాయి..బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుందనీ అర్చకులు, తెలిపారు..ఉత్సవాలు ఈ ఏడాది వైభవంగా నిర్వహిస్తున్నామనీ ఉత్సవ కమీటీ సభ్యులు చెప్పారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *