ప్రజా ఆరోగ్యంపై సీఎం ప్రత్యేక శ్రద్ధ

ఎమ్మెల్యే విజయశ్రీ

నాయుడుపేటలో బీట్ ద హీట్ లో పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యే

ప్రజా ఆరోగ్యంపై సీఎం ప్రత్యేక శ్రద్ధ…

  • ఎమ్మెల్యే విజయశ్రీ
  • నాయుడుపేటలో బీట్ ద హీట్ లో పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యే


బీట్ ద హీట్ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వరరావ్, ఎమ్మెల్యే విజయ్ శ్రీ పాల్గొన్నారు. మొక్కలు నాటి చలివేంద్రాలను వారు ప్రారంభించారు. ప్రజా ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు.


తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వరరావ్, ఎమ్మెల్యే విజయ్ శ్రీ పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ ఫజులుల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన బీట్ ద హీట్ కార్యక్రమంలో మొక్కలు నాటడంతోపాటు చలివేంద్రాలను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రోగ్రామ్ని ప్రజలు అవగాహన చేసుకోవాలని కలెక్టర్ కోరారు. నియోజకవర్గంలో ప్రతి మూడవ శనివారం స్వచ్ఛ్ ఆంధ్ర నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే విజయశ్రీ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ముందుచూపుతో ప్రజా ఆరోగ్యం కోసం క్లీన్ అండ్ గ్రీన్ పై ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *