వింజమూరులో అన్న క్యాంటీన్ భవనానికి ఎమ్మెల్యే కాకర్ల శంకుస్థాపన
పేదోడి ఆకలి తీర్చేదే అన్న క్యాంటీన్
- వింజమూరులో అన్న క్యాంటీన్ భవనానికి ఎమ్మెల్యే కాకర్ల శంకుస్థాపన
అన్న క్యాంటీన్ భవనానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ భూమి పూజ చేసి శంఖుస్థాపన చేశారు. పేదోడి ఆకలి తీర్చేందుకు తెలుగుదేశం ప్రభుత్వం అన్న క్యాంటీన్ తీసుకువచ్చిందని ఆయన చెప్పారు.
నెల్లూరు జిల్లా వింజమూరులో అన్న క్యాంటీన్ భవనానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక టీడీపీ శ్రేణులతో కలసి అన్న క్యాంటీన్ భవనానికి భూమి పూజ చేసి శంఖుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మీడియాతో మాట్లాడుతూ… పేదల ఆకలి తీర్చేందుకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా పనిచేస్తుందన్నారు. అందులో భాగంగానే వింజమూరు ప్రాంతంలో ఈ భవనానికి శంకుస్థాపన చేయడం జరిగిదన్నారు. ప్రజలు నిత్యం పని నిమిత్తం వింజమూరు కేంద్రానికి రావడం జరుగుతుందని, వారికి ఆకలి తీర్చే విధంగా అన్న క్యాంటిన్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయుకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.