తోడైన ఈదురుగాలులు
జలమయమైన రోడ్లు
కావలిలో దంచికొట్టిన వాన…
- తోడైన ఈదురుగాలులు
- జలమయమైన రోడ్లు
కావలిలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ట్రంకురోడ్డు, ఇతర రోడ్లు పూర్తిగా వర్షపునీటితో జలమయమయ్యాయి. ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలు కాస్త ఉపశమనం పొందారు.
నెల్లూరు జిల్లా కావలి పట్టణం, మండలంలో శుక్రవారం ఉదయం వర్షం దంచికొట్టింది. ఉదయం 7 గంటలకే ఆకాశం పూర్తిగా మారిపోయి దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. అలా ఈదురుగాలులతో వర్షం ప్రారంభమయ్యి ఏకధాటిగా అర్ధగంట సమయం భారీగా కురిసింది. దీంతో కావలి పట్టణంలో ట్రంక్ రోడ్డు, ఇతర రోడ్లు పూర్తిగా జలమయం అయ్యాయి. వేసవిలో ఈ వర్షం కావలి పట్టణానికి కాస్త ఊరటనే ఇస్తుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. నిండు వేసవిలో వాతావరణం చల్లబడింది.