రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ
నగరంలోని వీఆర్ హైస్కూల్ ఆధునీకరణ పనులను పరిశీలించిన మంత్రి
రాష్ట్రంలోనే బెస్ట్ స్కూల్ గా వీఆర్ హైస్కూల్…
- రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ
- నగరంలోని వీఆర్ హైస్కూల్ ఆధునీకరణ పనులను పరిశీలించిన మంత్రి
వీఆర్ హైస్కూల్ ఆధునీకరణ పనులను రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. తొలగించిన భవనాల స్థానం లో ప్లే గ్రౌండ్ ఏర్పాటుపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు.
నెల్లూరు నగరంలోని నిరుపేద విద్యార్థుల కోసం వి ఆర్ హైస్కూల్ ను కార్పొరేట్ తరహా వసతులతో రాష్ట్రంలోనే ఒక బెస్ట్ స్కూల్ గా తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ చెప్పారు. నగరంలోని వీఆర్ హైస్కూల్ ఆధునీకరణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. తొలగించిన భవనాల స్థానం లో ప్లే గ్రౌండ్ ఏర్పాటుపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. కాపాండ్ వాల్ పటిష్టంగా నిర్మించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికల ముందు పేద పిల్లల కోసం నగరం నది బొడ్డు లో ఉన్న వీఆర్ హైస్కూల్ ను పునరుదరిస్తామని చెప్పిన ప్రకారం సిద్ధం చేస్తున్నామన్నారు. నెలాఖరు లోపు పనులన్నీ పూర్తవుతాయన్నారు. జూన్ 12 నాటికి ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలోనే మోడల్ స్కూల్ గా విఆర్సీ రూపాంతరం చెందబోతోందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్ ,మున్సిపల్ కమిషనర్ నందన్ , నాయకులు ,కార్యకర్తలు,ఎన్సీసీ, కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.