దంపా పెంచలవిజయ్ రెడ్డికి గోల్డ్ మెడల్ అందించిన సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్శిటీ
కలువాయి వాసికి గోల్డ్ మెడల్
- దంపా పెంచలవిజయ్ రెడ్డికి గోల్డ్ మెడల్ అందించిన సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్శిటీ
దాచూరు గ్రామానికి చెందిన దంపా పెంచలవిజయ్ రెడ్డి అగ్రికల్చర్ లో 9.27 జీపీఏ సాధించాడు. మణిపూర్ రాష్ట్రం ఇంపాల్ లోని సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అతనికి గోల్డ్ మెడల్ బహుకరించింది.
నెల్లూరు జిల్లా కలువాయి మండలం దాచురు గ్రామానికి చెందిన దుంపా పెంచల స్వామి, రేణుకల పెద్దకుమారుడు దుంపా పెంచలవిజయ్ రెడ్డి అగ్రికల్చర్ ఎంఎస్సీలో 9.27 జీపీఏ సాధించాడు. ఈ సందర్భంగా మణిపూర్ రాష్ట్రం ఇంపాల్ లోని సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పెంచల విజయ్ రెడ్డికి గోల్డ్ మెడల్ బహుకరించారు. 2002 సంవత్సరంలో కూడా ఇదే విద్యార్థి తాడేపల్లి గూడెం నందు అగ్రికల్చర్ బి ఎస్ సి లో గోల్డ్ మెడల్ సాధించాడు. తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.