టీడీపీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న తెలుగు తమ్ముళ్లు_
ఘనంగా అబ్ధుల్ అజీజ్ జన్మదిన వేడుకలు
- టీడీపీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న తెలుగు తమ్ముళ్లు
వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్ధుల్ అజీజ్ జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. టీడీపీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్ధుల్ అజీజ్ జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి…హ్యాపీ బర్త్ డే అజీజ్ భాయ్ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లా దయతో నిండునూరేళ్లు ఆయూర్ ఆరోగ్యాలు, అష్ఠైశ్వరాలతో జీవించాలని…భవిష్యత్ లో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని…వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో అజీజ్ అభిమానులు పాల్గొన్నారు.