రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ
మంత్రి నిర్ణయాన్ని హర్షించిన స్థానికులు
అరవపాళెంలో అతి పెద్ద పార్క్…
- రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ
- మంత్రి నిర్ణయాన్ని హర్షించిన స్థానికులు
నెల్లూరు నగరం అరవపాళెంలో మంత్రి నారాయణ పర్యటించారు. స్థానికుల కోరిక మేరకు అరవపాళెంలో అతి పెద్ద పార్క్ ను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు.
చిల్డ్రన్స్ పార్క్ లో తరహాలో.. అతి పెద్ద పార్కును అరవపాలెంలో కూడా నిర్మి్స్తామని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. నెల్లూరు నగరం బోడిగాడితోట సమీపంలోని అరవపాళెంలో ఆయన పర్యటించారు. స్థానికుల కోరిక మేరకు..అక్కడ ఒక అందమైన పార్కును నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు.. దాదాపు ఎకరా స్థలంలో పెద్ద పార్కును నిర్మించేందుకు మంత్రి అధికారులకు ఆదేశించారు. అరవపాలెంలో అతి పెద్ద పార్క్ నిర్మించేందుకు నారాయణ నిర్ణయం తీసుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. ఈ పార్క్ డివిజన్ ప్రజలకి అందుబాటులో ఉంటుందని టీడీపీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ తో పాటు టీడీపీ సీనియర్ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, లెక్కల వెంకరెడ్డి , ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.