ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి..

బుచ్చిరెడ్డిపాళెంలో సురక్ష సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి…

  • బుచ్చిరెడ్డిపాళెంలో సురక్ష సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో సురక్ష సూపర్ స్పెషాలిటి ప్రారంభహోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విచ్చేశారు. పట్టణ టిడిపి నాయకులు ఆమెకి ఘన స్వాగతం పలికారు. హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ల్యాబ్ తదితర వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సురక్ష సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ నిర్వాహకులను కోరారు. అనంతరం పట్టణంలో రాఫిట్ జిమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, వైస్ ఛైర్మెన్ శివకుమార్ రెడ్డి, కౌన్సిలర్లు పుట్టా లక్ష్మి కాంతమ్మ, తాళ్ల వైష్ణవిలతో పాటు మండల టిడిపి నాయకులు, బత్తల హరికృష్ణ, ఎంవి శేషయ్య, విజం రామానాయుడు. టంగుటూరి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *