ముస్లిం పిల్లలకు ఉచితంగా ఖత్నా

ముఖ్య అతిధిగా పాల్గొన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్

పేద ముస్లిం కుటుంబాలకు మందులు, నిత్యావసరాలు పంపిణీ

ముస్లిం పిల్లలకు ఉచితంగా ఖత్నా…

  • ముఖ్య అతిధిగా పాల్గొన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
  • పేద ముస్లిం కుటుంబాలకు మందులు, నిత్యావసరాలు పంపిణీ

నెల్లూరు నగరంలోని కోటమిట్ట ఏ ఆర్ బి కళ్యాణ మండపంలో జిల్లా వైఎస్ఆర్సిపి మైనారిటీ సెల్ అధ్యక్షులు సిద్ధిక్ ఆధ్వర్యంలో పేద ముస్లిం పిల్లలకు ఉచిత ఒడుగుల కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. సిద్ధిక్, ముస్లిం సోదరులు అనిల్ కి ఘన స్వాగతం పలికారు. అనిల్ కుమార్ యాదవ్ ఖత్నా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పేద ముస్లిం కుటుంబాలకు ఉచితంగా మందులు, నిత్యావసరాలు పంపిణీ చేశారు. అనంతరం అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ…మంచి కార్యక్రమాన్ని చేపట్టిన సిద్ధిక్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్లు, ప్రముఖ న్యాయవాది మల్రెడ్డి కోటారెడ్డి, ముస్లిం మత పెద్దలు, మైనారిటీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *