నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ లో
ఫోరెన్సిక్ సైన్స్ ఎవిడెన్స్ మేనేజ్మెంట్ పై ఒక్క రోజు శిక్షణా కార్యక్రమం
ఆధునిక నేరాలను ఆధునిక పద్ధతుల్లోనే ఎదుర్కోవాలి…
- జిల్లా ఎస్పీ కృష్ణకాంత్
- నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ లో ఫోరెన్సిక్ సైన్స్ ఎవిడెన్స్ మేనేజ్మెంట్ పై ఒక్క రోజు శిక్షణా కార్యక్రమం
ఆధునిక నేరాలను ఆధునిక పద్ధతుల్లోనే ఎదుర్కోవాలని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. రాష్ట్ర డి.జి.పి హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు… ఫోరెన్సిక్ సైన్స్ ఎవిడెన్స్ మేనేజ్మెంట్ పై జిల్లాలో పని చేస్తున్న దర్యాప్తు అధికారులకు, ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఒక్క రోజు శిక్షణ కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించారు. నిందితులు శిక్షించడంలో నేర స్థలం నుండి శాస్త్రీయ పద్ధతిలో ఆధారాల సేకరణే క్రియాశీలకమని ఎస్పీ సూచించారు. ప్రతి అధికారి తన బాధ్యతగా దీనిని తీసుకోవాలన్నారు. విచారణాధికారులు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలని, ఎటువంటి తప్పులు చేయకూడదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు