మంత్రికి ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు
కొండేపాటి నివాసానికి మంత్రి లోకేష్
- మంత్రికి ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు
రెండు రోజుల పర్యటనలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తిరుపతి జిల్లాకు రానున్నారు. సత్యవేడులో నాయకులతో ఆయన సమావేశమై శ్రీ సిటీకి చేరుకుంటారు. మార్గమధ్యలో తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని నాలుగు నియోజకవర్గాల సమన్వయకర్త ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగా ప్రసాద్ నివాసంలో మంత్రి లోకేష్ కు ఆతిథ్యం ఏర్పాట్లు చేస్తున్నారు. పలు కీలక అంశాలపై మంత్రి లోకేష్, సీనియర్ నేత కొండేపాటి గంగా ప్రసాద్ మధ్య చర్చలు జరగనున్నాయి. మంత్రి నారా లోకేష్ కు గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశం సునీల్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం కు భారీ ఏర్పాట్లు చేయనున్నారు. ఘన స్వాగతం పలికేందుకు సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, టిడిపి శ్రేణులు సిద్ధమయ్యారు.