సంక్షిప్త వార్త మాలిక
విడవలూరు మండలం రామతీర్ధం సముద్ర తీరంలో వింత ఘటన చోటు చేసుకుంది. సముద్ర తీరానికి గంగమ్మ తల్లి విగ్రహం కొట్టుకువచ్చింది. ఇది చూసేందుకు చుట్టు పక్కల గ్రామస్థులు తరలి వస్తున్నారు.
రాపూరు పట్టణంలో జనసేన నాయకులు డొక్కా సీతమ్మ పేరుతో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని జనసైనికులు తెలిపారు.
నెల్లూరు నగరం 47వ డివిజన్లో కార్పొరేటర్ పోట్లూరి రామకృష్ణ పర్యటించారు. డివిజన్లోని గడప గడపకు వెళ్లి ప్రజల్ని ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఓజిలి మండలం బట్లకనుపూరు గ్రామానికి చెందిన సిద్ధిలింగం అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. 100కి ఫోన్ చేశానని…అయినా కూడా ఇప్పటి వరకు ఎవరూ తనను పట్టించుకోవడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
47వ డివిజన్ గర్శివీధిలోని హ్యాండ్ బోరుని కార్పొరేటర్ పోట్లూరి రామకృష్ణ మరమ్మతులు చేయించి…తాగునీటి బోరును అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో స్థానికులు ఆయనకి, మున్సిపల్ అధికారులకి కృతజ్ఞతలు తెలియజేశారు.
కోవూరు మండల పరిధిలోని సాయిబాబా గుడి నేషనల్ హైవే బ్రిడ్జిపై మోటారు బైక్ ని లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో మానేగుంటపాడు అరుంధతివాడకు చెందిన కాకుమూడి వెంకటరమణయ్య స్పాట్లోనే దుర్మరణం చెందాడు.
ఆత్మకూరు పట్టణం నాగేంద్రపురం సమీపంలో నూరుల్లా అనే వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మోటారు బైకులు దొంగతనం చేసిన నిందితుల్ని కుప్పం పోలీసులు అరెస్టు చేశారు. ముద్దాయి వద్ద నుంచి 3.5 లక్షల విలువ చేసే రెండు బైక్ లను స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ సీఐ మల్లేష్ యాదవ్ తెలిపారు.
సూళ్లూరుపేట పట్టణంలో జనం దాహర్తి తీర్చేందుకు టీటీడీ మాజీ బోర్డ్ సభ్యులు వేనాటి రామచంద్రారెడ్డి వితరణతో వాటర్ కూలర్ ను ఏర్పాటు చేశారు. ఈ వాటర్ కూలర్ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
24 గంటలు గడవక ముందే…సూళ్లూరుపేటలోని కాళంగి నదిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వెంటనే అధికారులు స్పందించి నదీ ఒడ్డున సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
అనకాపల్లిలో జరిగిన రతన్ టాటా స్మారక ఇంటర్నేషనల్ ఫీడ్ ఓపెన్ రేటింగ్ టోర్నమెంట్ లో అన్ రేటింగ్ కేటగిరి నందు నెల్లూరు జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి వై. సుమన్ ఆధ్వర్యంలో స్థానిక చిల్డ్రన్స్ పార్కు మెయిన్ రోడ్డులోని కార్యాలయంలో అభినందన సభ ఏర్పాటుచేసి క్రీడాకారుల్ని ప్రశంసించారు.