సీఎం ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్, కలెక్టర్, ఎస్పీలతో కలసి ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఆనం
అధికారులకు పలు సూచనలు, సలహాలు చేసిన మంత్రి
మే 1న ఆత్మకూరుకి సీఎం రాక…
- సీఎం ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్, కలెక్టర్, ఎస్పీలతో కలసి ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఆనం
- అధికారులకు పలు సూచనలు, సలహాలు చేసిన మంత్రి
ఆత్మకూరులో వచ్చేనెల 1వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆత్మకూరు పర్యటన సందర్భంగా సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణ కాంత్, అధికారులతో కలిసి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. ఆత్మకూరు బీసీ బాలికల గురుకుల పాఠశాల వద్ద హెలీప్యాడ్, నారంపేట ఎం ఎస్ ఎం ఈ పార్క్ ఆవిష్కరణ కార్యక్రమం, నెల్లూరు పాలెం వద్ద గిరిజన కాలనీలో పింఛన్ల పంపిణీ ఏర్పాట్లను పరిశీలించారు.పార్టీ కార్యకర్తల సమావేశం కోసం బీసీ బాలికల గురుకుల పాఠశాల మైదానాన్ని పరిశీలించారు.అనంతరం సీఎం బహిరంగ సభ కోసం ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మైదానం, వాటర్ ట్యాంక్ సమీపంలోని మున్సిపల్ పార్కు స్థలం, రవితేజ కళ్యాణ మండపం సమీపంలోని స్థలాన్ని పరిశీలించారు.