ఫీల్డ్ అసిస్టెంట్ తొలగింపుపై ఎంపిడిఓను నిలదీసిన మాలేపాటి సోదరులు
టిడిపి నాయకుడు పమిడి రవికుమార్ చౌదరి, ఏపీవో అచ్చయ్య సూచనలతో తొలగించారని మండిపాటు
పనుల కల్పనకు వైసీపీ నేతలను అడగాలా అంటూ రమణమ్మ ఆవేదన
దగదర్తిలో ”ఉపాధి” రగడ..
- ఫీల్డ్ అసిస్టెంట్ తొలగింపుపై ఎంపిడిఓను నిలదీసిన మాలేపాటి సోదరులు
- టిడిపి నాయకుడు పమిడి రవికుమార్ చౌదరి, ఏపీవో అచ్చయ్య సూచనలతో తొలగించారని మండిపాటు
- పనుల కల్పనకు వైసీపీ నేతలను అడగాలా అంటూ రమణమ్మ ఆవేదన
దగదర్తి ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ పెంచలయ్య తొలగింపుపై టిడిపి రాష్ట్ర కార్యదర్శి మాలేపాటి సుబ్బానాయుడు, ఆయన సోదరుడు రవీంద్ర నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయానికి చేరుకొని
ఎంపిడిఓ వెంకటేశ్వర్లు, ఏపీవో అచ్చయ్యలను నిలదీశారు. పమిడి రవికుమార్ చౌదరి చెబితేనే ఫీల్డ్ అసిస్టెట్ ను తొలగించామని ఏపీవో చెప్పాడని, ఆయన చెబితే తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. ఫీల్డ్ అసిస్టెంట్ పెంచలయ్యను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఒక కరుడుగట్టిన వైసీపీ నేత చెబితే పనులు పెడతానని ఏపీవో చెప్పడం ఏమిటని నిలదీశారు.