ఎన్3న్యూస్ బుల్లెట్స్‌

సంక్షిప్త వార్త మాలిక‌

నెల్లూరులోని వీఆర్ హైస్కూల్ కి పూర్వ వైభవం తీసుకువస్తానని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. హైస్కూల్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. అధికారులకు పలు విషయాలపై మంత్రి సూచనలు చేశారు.

బుచ్చిరెడ్డిపాళెం మండలం చెల్లాయపాళెం గ్రామంలో వెలసి ఉన్న సాయిబాబా మందిరం 13వ వార్షికోత్సవం కన్నుల పండువగా జరిగింది. సాయినాథునికి విశేష అభిషేకాలు నిర్వహించి…పలు రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు.

అమరావతి టీడీపీ కేంద్ర కార్యాలయంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగే ఎలక్ట్రిక్‌ ట్రై సైకిళ్ల అందజేత కార్యక్రమానికి మినీ స్టేడియం సర్వం సిద్ధమైంది. ఎంపీ వేమిరెడ్డి, కావలి ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి, ముఖ్య నేతలు పాల్గొని దివ్యాంగులకి ట్రై సైకిళ్లు పంపిణీ చేయనున్నారు.

కావలి విశ్వశాంతి పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులకు లుసిడా హ్యాండ్ రైటింగ్ శిక్షణా కార్యక్రమం జరిగింది. అచురిత ఫౌండేషన్ ధ్యారా కృపాల్ శిక్షణ ఇచ్చారు.

మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సఖీ వన్ స్టాఫ్ సెంటర్ అడ్మిన్ షహనాజ్ తెలిపారు. కలువాయిలోని సమైఖ్య కార్యాలయంలో బాల్య వివాహాలు, ఫోక్సో చట్టం, మహిళలపై లైంగిక వేధింపులపై అవగాహన సదస్సు నిర్వహించారు.

కావలి కచ్చేరిమిట్టలోని సదరన్ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో సండే స్కూల్ పిల్లలకు వీబీఎస్ తరగతులు ఉత్సాహంగా సాగాయి. పిల్లలకు క్రీస్తుని పాటలు, సంగీతంతో ఉత్సాహ పరిచారు.

విద్యతోనే గిరిజనులకు ఉజ్వల భవిష్యత్ అని గిరిజన చైతన్య విద్యా వేదిక రాష్ట్ర నాయకులు పులి చెంచయ్య తెలిపారు. విడవలూరు మండలం ఊటుకూరులోని గిరిజన కాలనీలో చైతన్య విద్యా వేదిక కార్యక్రమంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.

వేసవిలో చిన్నారులు ఈత కొట్టడేందుకు చెరువులు, కాలువల దగ్గర వెళ్లకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోవూరు సీఐ సుధాకర్ రెడ్డి సూచించారు. సర్కిల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర బీసీ నాయకుడైన సుభాష్ ను విమర్శించడం సరికాదని బీసీ నేతలు మండిపడ్డారు. నాగరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోవూరు ఎస్ఐకి వారు వినతి పత్రం అందచేశారు.

కలువాయి మండలం పర్లకొండ గ్రామం అరుంధతీయవాడలోని మాతమ్మ ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. హుండీలోని నగదు, కానుకలను ఎత్తుకెళ్లారు. ఏఎస్ఐ కే రమణయ్య ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

నా జీవితంలో ఈ రోజు ఎంతో అదృష్టమైన రోజు అని… నటకిరిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. తన నివాసంలో సీనియర్ జర్నలిస్ట్ ఉదయగిరి ఫయాజ్ రచించిన రక్తకన్నీరు నాగభూషణం అనే పుస్తకాన్ని రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు.

ముత్తుకూరు మండల కేంద్రంలోని సంఘమిత్ర కార్యాలయంలో ఐసిడిఎస్ సిబ్బంది, పొదుపు సీసీలకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఎంపీడీవో నాగమణి,సిడిపిఓ రాజ్యలక్ష్మి తదితరులు బాల్యవివాహాల నిర్మూలన, ఫొక్సో యాక్ట్ , తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మత్స్యకారులకు ఆర్థిక సహాయ మెగా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, కలెక్టర్ వెంకటేశ్వర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులను అందచేశారు.

ముత్తుకూరు మండలంలో పోలీసులు జల్లెడ పట్టారు. కృష్ణపట్నం సర్కిల్ సీఐ రవి నాయక్ , కృష్ణపట్నం ఎస్ ఐ శ్రీనివాస్ రెడ్డి సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *