పూర్వవైభవం తెచ్చేందుకు ఎమ్మెల్యే చర్యలు
రూ.7.64లక్షల నిధుల కేటాయింపు
మొదలైన కోనేరు సుందరీకరణ పనులు
ఆనందం వ్యక్తం చేసిన ప్రజలు
శిథిలమైన కోనేరు..
పూర్వవైభవం తెచ్చేందుకు ఎమ్మెల్యే చర్యలు
-రూ.7.64లక్షల నిధుల కేటాయింపు
-మొదలైన కోనేరు సుందరీకరణ పనులు
ఆనందం వ్యక్తం చేసిన ప్రజలు
అది.. తిరుపతి జిల్లాలోని గూడూరు నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలోని.. వాకాడు మండలం.. గొల్లపాళెం గ్రామం. ఆ గ్రామంలో అనేక ఏళ్లుగా ఓ కోనేరు శిథిలావస్థకు చేరుకుని.. నిరుపయోగంగా ఉంది. ఆ కోనేరుకు పూర్వ వైభవం తీసుకొచ్చి.. సుందరంగా నిర్మించుకునేందుకు ఆ గ్రామ ప్రజలు నిర్ణయించుకున్నారు. అందుకు పూర్తి సహకారం అందించాలని పారిశ్రామికవేత్త, టీడీపీ నాయకులు సన్నారెడ్డి ప్రసాద్‌రెడ్డిని కోరారు. ఆయన గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సానుకూలంగా స్పందించారు. ఎన్ ఆర్ జి ఎస్ అమృత సరోవర్ పథకం ద్వారా 7లక్షల 64వేల రూపాయిల నిధులను కేటాయించారు. కేటాయించిన నిధులు సరిపోకపోతే.. తమ సొంత నిధుల ద్వారా పూర్తి చేస్తామని ఈసందర్భంగా పారిశ్రామికవేత్త సన్నారెడ్డి ప్రసాద్‌రెడ్డి ఆ ప్రజలకు హామీ ఇచ్చారు. దాంతో ఆ గ్రామంలోనివారంతా ఆనందం వ్యక్తం చేస్తూ… ఎన్-3 తో వారు మాట్లాడారు. కోనేరు ఏర్పాటుకు సహాయ సహకారాలు అంందించిన ఎమ్మెల్యేకి, ప్రసాద్‌రెడ్డికి వారు ధన్యవాదాలు తెలియజేశారు. ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారం.. ప్రస్తుతం ఆ కోనేరులో అభివృద్ధి పనులు మొదలు పెట్టేయడంతో ప్రజలంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.