ముఖ్య అతిధిగా పాల్గొన్న సంతపేట సీఐ దశరధరామారావు
కప్పిర శ్రీనివాసులుకి అభినందనల వెల్లువ
వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారులకి ఘన సత్కారం
- ముఖ్య అతిధిగా పాల్గొన్న సంతపేట సీఐ దశరధరామారావు
- కప్పిర శ్రీనివాసులుకి అభినందనల వెల్లువ
టీడీపీ సీనియర్ నాయకుడు కప్పిర శ్రీనివాసులు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని…. నెల్లూరు నగరం సంతపేటలోని తిక్కన పార్కు లో…ఇటీవల గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించిన ఆరుగురు చిన్నారులకి అభినందన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక సీఐ దశరధరామారావు, టీడీపీ ముఖ్య నేతలు ముఖ్య అతిధులుగా విచ్చేశారు. కప్పిర రేవతి ఆధ్వర్యంలో…సీఐ, శ్రీనివాసులు తదితరులు చిన్నారులకి మెమోంటోలు, షీల్డ్ లు అందచేసి అభినందించి సన్మానించారు. అనంతరం కప్పిర శ్రీనివాసులుకి పూలబొకేలు అందచేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఐ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.