అంబరాన్నంటిని విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు
ఘనంగా శ్రీ కృష్ణ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు…
- అంబరాన్నంటిని విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు
నెల్లూరు నగరం విరాట్ నగర్ లోని శ్రీ కృష్ణ స్కూల్ ఇంగ్లీషు మీడియం స్కూల్ 20 వార్షికోత్సవ వేడుకలను స్కూల్ కరస్పాండెంట్ కేసీ కృష్ణ ఘనంగా నిర్వహించారు. విద్యార్థినీ విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యంయంతం అందరిని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రామాయణం స్కిట్ ని విద్యార్థులు కళ్లకు కట్టినట్లు చేసి చూపించి అందరి మనస్సులను గెలుచుకున్నారు. ఈ వేడుకల్లో పూర్వపు విద్యార్థులు కూడా తోటి విద్యార్థులతో కలసి ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా పూర్వపు విద్యార్థుల్ని కరస్పాండెంట్ కి జ్క్షాపికను అందచేసి శాలువాలతో సత్కరించారు. అనంతరం కేసీ కృష్ణ ఎన్ త్రీ న్యూస్ తో మాట్లాడారు. వార్షికోత్సవ వేడుకలు విద్యార్థులకి ఎందో దోహద పడుతాయన్నారు. తమ స్కూల్ విజయవంతంగా 20 ఏళ్లుగా పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన స్కూల్ ఉఫాధ్యాయునీలు, విద్యార్థులు, తల్లిదండ్రులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు.