మిర్చి లారీని ఢీ కొన్న ధాన్యం లారీ

గూడూరు హైవే పై ప్రమాదం

తిరుపతి జిల్లా గూడూరు జాతీయ రహదారిపై మినీ బైపాస్ సర్కిల్ సమీపంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది…గుంటూరు నుండి చెన్నైకు మిర్చి లోడుతో వెళ్తున్న లారీని వెనకవైపు నుండి ధాన్యం లోడు తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది… ఈ ప్రమాదంలో ప్రమాదంలో వెనుక నుండి ఢీ కొట్టిన లారీలో ఉన్న డ్రైవర్ కు, క్లీనర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి.. అలాగే ముందు లారీలో ఉన్న డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి… గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.. అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరు తరలించారు… ప్రమాదంలో లారీ జాతీయ రహదారిపై అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది… ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు… క్రేన్ సహాయంతో లారీలను తొలగించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *