మిన్నంటిన టిడిపి శ్రేణుల సంబరాలు

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పుట్టిన రోజును పండుగులా జరుపుకున్న నాయకులు

కావలి టిడిపి కార్యాలయంలో కేక్ కట్ చేసి సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

మిన్నంటిన టిడిపి శ్రేణుల సంబరాలు…!

  • టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పుట్టిన రోజును పండుగులా జరుపుకున్న నాయకులు
  • కావలి టిడిపి కార్యాలయంలో కేక్ కట్ చేసి సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినంను కావలి టిడిపి కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కోలాహలంగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. .టిడిపి నాయకులు మాట్లాడుతూ నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు,మొగిలి కల్లయ్య, కావలి మున్సిపల్ మాజీ చైర్మన్ పోతుగంటి అలేఖ్య, లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు పొట్లూరి శ్రీనివాసులు, పార్టీ సీనియర్ నాయకులు అన్నదాత మణి, నాయకులు దేవకుమార్, కాకి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *