ఎన్‌3న్యూస్ బుల్లెట్స్‌

సంక్షిప్త వార్త మాలిక‌

నెల్లూరులోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి నారాయణతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. జిల్లా కేంద్రంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పలు అంశాలను వారు సుదీర్ఘంగా చ‌ర్చించారు.

ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినం సందర్భంగా శనివారం నెల్లూరులో భారీగా సేవా కార్యక్రమాలకు కూటమి నేతలు, అభిమానులు శ్రీకారం చుట్టారు. నగరాన్ని వీపీఆర్ ఫ్లెక్సీలతో నింపేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

రాపూరు మండలంలో అగ్నిమాపక వారోత్సవాలను ఫైర్ స్టేషన్ సీఐ కుప్పయ్య నిర్వహించారు. ప్రమాదాలు సంభవించినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో సిబ్బంది మాక్ డిల్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు.

గుడ్ ఫ్రైడే సందర్భంగా.. ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు నెల్లూరు నగరం బట్వాడిపాళెంలో వెయ్యి మందికి రస్నా పంపిణీ చేశారు. ప్రజలందరిపై ఏసు ప్రభువు దయ, ప్రేమ ఉండాలని ప్రార్ధించామని వారు చెప్పారు.

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో గుడ్ ఫ్రైడేని క్రైస్తవ సోదరులు ఘనంగా జరుపుకున్నారు. జాషువా సీయోను ప్రేయర్ హాల్ చర్చిలో క్రైస్తవ సోదరులు ప్రార్ధనలు చేశారు.

ముత్తుకూరు మండల కేంద్రంలో జరిగిన పి ఫోర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం యాష్ పాండ్ కి భూములు ఇచ్చిన యజమానులకు ఆర్డీవో నాగ సంతోష్ అనూష తో కలిసి ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో భూ భారతి చట్టం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, కలెక్టర్ జితేష్ వీ పటేల్, ఆర్డీవోలు పాల్గొని భూ భారతి చట్టంపై రైతులకి అవగాహన కల్పించారు.

కుప్పంలో అంతర్జాతీయ అగ్నిమాపక వారోత్సవాలను అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ క్యాంపస్ సిఈఓ సురేష్ నిర్వహించారు. ఫైర్ డిపార్ట్ మెంట్ ఎస్ఐ ప్రవీణ్, సిబ్బంది అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకి అవగాహన కల్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *