ఎంపీ వేమిరెడ్డి ఫ్లెక్సీలతో నిండిన నెల్లూరు
శనివారం పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన కూటమి నేతలు, అభిమానులు
కేతంరెడ్డి ఆధ్వర్యంలో అన్నదానాలు
వీపీఆర్ బర్త్ డేకి భారీగా సేవా కార్యక్రమాలు
- ఎంపీ వేమిరెడ్డి ఫ్లెక్సీలతో నిండిన నెల్లూరు
- శనివారం పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన కూటమి నేతలు, అభిమానులు
- కేతంరెడ్డి ఆధ్వర్యంలో అన్నదానాలు
నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినం సందర్భంగా శనివారం కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా సిటీ, రూరల్ నియోజకవర్గాలతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వేమిరెడ్డి పుట్టిన రోజుని పురస్కరించుకొని…జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలను ఆయన అభిమానులు చేపట్టనున్నారు. అలాగే టీడీపీ యువనేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నగరంలోని అలంకార్ సెంటర్, వీఆర్సీ సెంటర్, నర్తకి సెంటర్, మినీ బైపాస్ రోడ్డు తదితర ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం వినోద్ రెడ్డి ఎన్3 న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు.