పలు కీలక అంశాలపై సుదీర్ఘ చర్చ
మంత్రి నారాయణతో ఎమ్మెల్యే కోటంరెడ్డి బేటీ
- పలు కీలక అంశాలపై సుదీర్ఘ చర్చ
నెల్లూరులోని మంత్రి నారాయణ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణను శుక్రవారం నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరులు మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రికి వారు పుష్పగుచ్చం అందజేసి బేటీ అయ్యారు. వారి వెంట నెల్లూరు కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్ నందన్ ఉన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కేంద్రంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పలు అంశాలను వారు సుదీర్ఘంగా చర్చించారు. సింహపురి ప్రజల సంక్షేమం, నెల్లూరు అభివృద్ధి ధ్యేయంగా సమిష్టిగా ముందుకెళ్లేందుకు మార్గదర్శకాలు, పెండింగ్‌లో ఉన్న పనుల వివరాలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రజాభిష్టం మేరకు నెల్లూరు అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళుతుందని ఈ సందర్భంగా వారు నిర్ణయించారు.