మొదటి సంతకం ఏమైంది సీఎం గారు..?

డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు సార్..?

నెల్లూరులో ధర్నా దిగిన నిరుద్యోగులు, డీవైఎఫ్ఐ నాయకులు

ధర్నాని అడ్డుకున్న పోలీసులు- ఇరువురి మధ్య వాగ్వాదం

మొదటి సంతకం ఏమైంది సీఎం గారు…

  • డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు సార్…?
  • నెల్లూరులో ధర్నా దిగిన నిరుద్యోగులు, డీవైఎఫ్ఐ నాయకులు
  • ధర్నాని అడ్డుకున్న పోలీసులు- ఇరువురి మధ్య వాగ్వాదం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు అయినా…డీఎస్పీ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం దారుణమని డీవైఎఫ్ఐ నాయకులు అన్నారు. డిఎస్సీపై చేసిన మొదటి సంతకం హామీ ఏమైంది ముఖ్యమంత్రి గారు వారు సూటిగా ప్రశ్నించారు. ఇందుకు నిరసనగా… డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగులు వీఆర్సీ సెంటర్ వద్ద ధర్నాకు దిగారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిరసన కారుల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. నిరుద్యోగులకి న్యాయం జరిగే తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. అనంతరం డీవైఎఫ్ ఐ నాయకులు మీడియాతో మాట్లాడారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులుకు ఇచ్చిన హామీ అమలు కోసం చర్యలు చేపట్టాలని తక్షణమే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని లేకుంటే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.వి రమణ, జిల్లా అధ్యక్షుడు బి.పి నరసింహ రూరల్ కన్వీనర్ జి.చైతన్య . జగదీష్.ఫయాజ్.శేఖర్ మహేష్.పవన్.వినోద్ కుమార్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *