ఇన్ఫినిటీ ఫిన్ కాప్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకులకి
కృతజ్ఞతలు తెలిపిన దువ్వూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
విద్యార్థులకి విద్యా సామాగ్రి పంపిణీ
- ఇన్ఫినిటీ ఫిన్ కాప్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకులకి కృతజ్ఞతలు తెలిపిన దువ్వూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఇన్ఫినిటీ ఫిన్ కాప్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకులు విద్యా సామాగ్రి పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. జడ్పీ హైస్కూల్, అంగన్వాడి పాఠశాల, ఎంపీపీఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులకు లక్షా 50 వేల రూపాయల విలువైన టేబుల్స్,విద్యా సామగ్రి పంపిణీ చేశారు. విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణీ చేసేందుకు సహకరించిన సంస్థ ఎండీ శ్రీకాంత్ రావల్కర్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ ప్రసన్నకుమార్, సంస్థ నిర్వాహకులు మోహన్, సురేష్ , విజయ సారధి ,శ్రీను, శ్రీకాంత్ , వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.