నెల్లూరులో శోభాయమానంగా హనుమాన్ భక్త శోభాయాత్ర
ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన కావలి శ్రీ వశిష్ఠ జూనియర్ కళాశాల విద్యార్థులు
ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పై మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు
ఇంటర్ ఫలితాల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్థులు విజయకేతనం
35లక్షలతో సీసీ రోడ్లు,రచ్చబండ అరుగుల నిర్మాణ పనులకు భూమిపూజ
మాజీ ఎమ్మెల్యే పొన్నెబోయిన చెంచురామయ్య వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్
కావలిలో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులు జనాన్ని బెంబేలెత్తించాయి
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ మంటల్లో మూడు ఇళ్లులు -నెల్లూరులో ఘనంగా సమతా ర్యాలీ
నెల్లూరులో హనుమాన్ భక్త శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. వేలాది మంది భక్తులతో నగర రోడ్లు కాషాయమయం అయ్యాయి. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో నగరం హోరెత్తింది.
ఇంటర్ ఫలితాల్లో కావలి శ్రీ వశిష్ఠ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారని డైరెక్టర్ కోటా సురేంద్ర రెడ్డి తెలిపారు. విద్యార్థుల్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
ఇంటింటి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కార్యక్రమంపై మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సూపర్ సిక్స్ పథకాలపై చేతులెత్తేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదని ఆయన ఎద్దేవా చేశారు.
ఇంటర్ ఫలితాల్లో…ముత్తుకూరులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్థులు విజయకేతనం ఎగుర వేశారు. రాష్ట్ర స్థాయిలో ముత్తుకూరు పేరుని నిలబెట్టారని ప్రిన్సిపాల్ సుజాత ప్రశంసించారు.
సీతారామపురం మండల పరిధిలోని పలు గ్రామాల్లో 35లక్షలతో సీసీ రోడ్లు,రచ్చబండ అరుగుల నిర్మాణ పనులకు ఎంపీపీ చింతంరెడ్డి పద్మావతి భూమిపూజ చేశారు. గ్రామాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు.
ఉదయగిరిలో జరిగిన మాజీ ఎమ్మెల్యే పొన్నెబోయిన చెంచురామయ్య వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆయన సతీమణి ప్రవీణ పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కావలిలో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులు జనాన్ని బెంబేలెత్తించాయి. మైదానంలో ఆడుకునే పిల్లలు, వాకర్స్, ఆరుబయట తిరిగే జనాలను గాలుల దాటికి దుమ్ము ధూళి చుట్టుముట్టి హడలెత్తించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం దురదపాడు పంచాయతీ పాలగుంపు గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ ప్రమాదంలో మూడు ఇళ్లులు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. సర్వం కోల్పోయామని..కట్టుబట్టలే మిగిలాయని బాధితులు బోరున విలపించారు.
నెల్లూరులో సమతా ర్యాలీ ఘనంగా జరిగింది. సింహపురి చైతన్య వేదిక, నెల్లూరు బహుజన యూత్ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అడుగడుగునా జై భీమ్ నినాదాలను హోరెత్తించారు