అల్లూరులో భక్తిశ్రద్ధలతో మట్టల ఆదివారం..

పురవీధుల్లో గీతాలు ఆలపించిన క్రైస్తవ సోదరులు

అల్లూరులో భక్తిశ్రద్ధలతో మట్టల ఆదివారం..

  • పురవీధుల్లో గీతాలు ఆలపించిన క్రైస్తవ సోదరులు

నెల్లూరు జిల్లా అల్లూరు మండల వ్యాప్తంగా క్రైస్తవ సోదరులు ఆదివారం అన్ని క్రైస్తవ సంఘాలలో మట్టల ఆదివారాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఏసుక్రీస్తు పాపులను రక్షించేందుకు సిలువ వేయబడే ముందు ఆదివారము గాడిదపై ఎరుషలేము వీధుల్లో సంచరించే సమయం ఎవరు అక్కడ ప్రజలు మట్టలను చేత పట్టుకొని యేసుక్రీస్తుకు స్వాగతం పలుకుతారు. ఆ తీరున ప్రతి క్రైస్తవ సంఘములో కూడా ఆదివారం రోజు చిన్నారులు యువకులు, పెద్దలు ఈత మట్టలకు పూలతో అలంకరించుకొని పురవీధుల్లో సంచరిస్తూ క్రైస్తవ గీతాలు ఆలపిస్తూ ముందుకు సాగారు. అనంతరం దైవ సందేశకులు క్రీస్తు వర్తమానాన్ని అందజేసి మట్టల ఆదివారాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో దైవ సందేశకులు ప్రసాద్, సురేష్, శామ్యూల్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *