ఆకట్టుకున్న చిన్నారుల వేషధారణలు
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
విశ్వసాయిలో అంబరాన్నింటిన గ్రాడ్యుయేషన్ డే సంబరాలు…
- ఆకట్టుకున్న చిన్నారుల వేషధారణలు
- అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
నెల్లూరు మాగుంట లేఅవుట్, చిల్డ్రన్స్ పార్కు వద్ద ఉన్న విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్ కే విద్యా సంస్థల్లో యూకేజీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ వేడుకలు అంబరాన్నంటాయి. గ్రాడ్యుయేషన్ డేని పురస్కరించుకొని… చిన్నారులు వేసిన వేషధారణలు అందరిని ఆకట్టుకుంది. సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యంతయం అలరించాయి. అనంతరం చిన్నారులకి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లను అందచేసి అభినందించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. తమ విద్యా సంస్థల్లో పిల్లలకు చదువుతోపాటు మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రోత్సహిస్తుంటామన్నారు. గ్రాడ్యుయేషన్ డే విజయవంతానికి సహకరించిన తల్లిదండ్రులు,విద్యార్థులు, అధ్యాపకులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు కృష్ణ మోహన్, శివసంకేత్, డీన్ ఎస్ రఘురాం, ప్రిన్సిపాల్ ఆనీ, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.