విద్యార్థుల అభినందన కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థల
జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి
ఇంటర్ ఫలితాల్లో నారాయణదే అగ్రస్థానం…
- విద్యార్థుల అభినందన కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి
ఫలితాలు ఏవైనా నారాయణ విద్యాసంస్థలకు తిరుగు లేదని మరోసారి రుజువైందని నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్ మీడియట్ పరీక్ష ఫలితాల్లో నారాయణ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. ఈ సందర్భంగా నగరంలోని హరినాధపురం నారాయణ కళాశాల క్యాంపస్ లో ఏర్పాటుచేసిన అభినందన కార్యక్రమంలో వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పాల్గొని విద్యార్థులను అభినందించారు. నారాయణ విద్యార్థులు అన్నీ గ్రూప్ లలో అద్భుతమైన ఫలితాలను అందిపుచ్చుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థల కోర్ డీన్ జయకుమార్ రాయుడు ,డీన్స్ వర్దిని ,మహేష్ ,రాజ మహేష్ రెడ్డి ,కె .శ్రీనివాస్ ,డీజీఎం మధు సూధన్ రెడ్డి ,ఏజీఎం లు ,ప్రిన్సిపాల్స్,టీచింగ్ స్టాఫ్ ,విద్యార్థుల పేరెంట్స్ పాల్గొన్నారు .