అన్నీ గ్రూప్ లలోనూ అద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థులు
టాపర్లను అభినందించిన కళాశాల డైరెక్టర్లు, అధ్యాపకులు
ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన కృష్ణచైతన్య
- అన్నీ గ్రూప్ లలోనూ అద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థులు
- టాపర్లను అభినందించిన కళాశాల డైరెక్టర్లు, అధ్యాపకులు
ఇంటర్ జూనియర్, సీనియర్ ఫలితాలను…ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు శనివారం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో… నెల్లూరులోని కృష్ణచైతన్య విద్యా సంస్థల విద్యార్థులు విజయ ఢంకా మోగించారు. బైపీసీ, ఎంపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూప్ లలో తమ కళాశాల విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారని…కళాశాల డైరెక్టర్లు ఆర్వీ కృష్ణారెడ్డి, రానా ప్రమోద్ రెడ్డిలు తెలియజేశారు. ముందుగా కళాశాల ఎదుట పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ మేరకు నగరంలోని కళాశాలలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థినీ విద్యార్థుల్ని డైరెక్టర్లు, అధ్యాపకులు అభినందించి స్వీట్లు తినిపించారు. డైరెక్టర్లు కృష్ణారెడ్డి, ప్రమోద్ రెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ… జిల్లాకే పరిమితమైన కృష్ణ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంతటి అద్భుత ఫలితాలు సాధించడం గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయానికి కారణమైన అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులకి ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో జూనియర్ కళాశాల డీన్ రామాంజనేయరెడ్డి, అకడమిక్ డీన్ రామ్ గోపాల్ రెడ్డి, అడ్మిన్ డీన్ రమేష్, ప్రిన్సిపాల్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.