వెంకటగిరిలోని ప్రైమరీ, అర్బన్ హెల్త్ సెంటర్లను పరిశీలించిన డాక్టర్ బాలకృష్ణ నాయక్
అందుబాటులో లేని డాక్టర్, సిబ్బందికి మెమోలు జారీ
ఆయా సెంటర్లలో వసతుల లేమీపై మండిపాటు
ఆగ్రహించిన డీఎం అండ్ హెచ్‌వో
- వెంకటగిరిలోని ప్రైమరీ, అర్బన్ హెల్త్ సెంటర్లను పరిశీలించిన డాక్టర్ బాలకృష్ణ నాయక్
- అందుబాటులో లేని డాక్టర్, సిబ్బందికి మెమోలు జారీ
- ఆయా సెంటర్లలో వసతుల లేమీపై మండిపాటు
ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని ప్రైమరీ హెల్త్ సెంటర్, అర్బన్ హెల్త్ సెంటర్లను తిరుపతి జిల్లా డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ బాలకృష్ణ నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మున్సిపాలిటీ మల్లమ్మ గుడి వద్ద ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లో నిధులకు గైర్హాజరైన డాక్టర్ రవితేజకు మెమో జారీ చేశారు. ఆసుపత్రి సిబ్బంది పనితీరుపై అసంతృప్తి చెందారు. మందుల స్టాక్ వివరాలు రికార్డులలో లేకపోవడంతో మెడికల్ ఫార్మాసిటీ శిరీష్ కు మెమో జారీ చేశారు. హెల్త్‌సెంటర్‌లో వసతులు లేమిపై మండిపడ్డారు. ఏఎన్ఎం, ఆశావర్లు సైతం అందుబాటులో లేకపోవడంపై సీరియస్ అయ్యారు. డీఎం అండ్ హెచ్‌వో పరిశీలనకు వచ్చిన సమయంలో ఒక్క పేషెంట్ కూడా లేకపోవడం గమనార్హం. దీంతో ఆయన తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తూ మోమోలు జారీ చేశారు.