కోవూరులో ఘ‌నంగా రంజాన్ పండుగ‌

భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో ముస్లిం సోద‌రులు ప్రార్ధ‌న‌లు

కోవూరులో ఘ‌నంగా రంజాన్ పండుగ‌…

  • భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో ముస్లిం సోద‌రులు ప్రార్ధ‌న‌లు

నెల్లూరు జిల్లా కోవూరు మండలం స్థానిక చిన్న ప‌డుగుపాడులోని మసీదులో రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జామియా మస్జిద్ ఈద్గా తక్యాయ వద్ద ముస్లిం మతపెద్దలు చేసిన బోధనలు అందరిని ఆకట్టుకున్నాయి. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయాన్నే చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా అందరు మసీదుకు చేరుకొని రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు .ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు ఒకరికొకరు ఆలింగనంచేసుకుంటూ రంజాన్ శుభాకాక్షలు తెలుపుకున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *