మినీ అంగన్వాడీ, ప్రీ స్కూల్ ఏర్పాటుకు అనువుగా కాల‌నీ

సంగంలో ప‌ర్య‌టించిన ఐసీడీఎస్ పీడీ, డిప్యూటీ డీఈవో

మినీ అంగన్వాడీ, ప్రీ స్కూల్ ఏర్పాటుకు అనువుగా కాల‌నీ

  • సంగంలో ప‌ర్య‌టించిన ఐసీడీఎస్ పీడీ, డిప్యూటీ డీఈవో

నెల్లూరు జిల్లా సంగంలోని పాత చెక్ పోస్ట్ వద్ద ఉన్న ఎస్సీ కాలనీలో ఐసీడీఎస్ పీడీ నిర్మలా దేవి, డిప్యూటీ డీఈఓ జానకీ రామ్ పర్యటించారు. తమ కాలనీలో అంగన్వాడీ పాఠశాల కావాలంటూ ఇటీవల సంగం పర్యటనకు వచ్చిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి కాలనీ వాసులు వినతిపత్రం సమర్పించారు. మంత్రి ఆనం ఆదేశాలతో అధికారులు పరిశీలించారు. మినీ అంగన్వాడీ పాఠశాల ,ప్రీ స్కూల్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన విద్యార్థులు ఉన్నారా లేదా అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు అవసరమైన బిల్డింగును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలతో పరిశీలించడం జరిగిందని తెలిపారు. కాలనీలో మినీ అంగన్వాడీ పాఠశాల, ప్రీ స్కూల్ ఏర్పాటుకు అనువుగా ఉందని..ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు సమర్పిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సిడిపిఓ సునీలత, సూపర్వైజర్ పద్మావతి, కాలనీవాసులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *