బుచ్చిలో రంజాన్ వేడుకలు

నల్ల రిబ్బన్లతో వక్ఫ్ నిరసనలు – వక్ఫ్ సవరణ బిల్లు 2024ను అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాలి

ప్రేమ, సోదరభావం, శాంతికి చిహ్నమే రంజాన్

బుచ్చిలో రంజాన్ వేడుకలు

  • నల్ల రిబ్బన్లతో వక్ఫ్ నిరసనలు..
  • వక్ఫ్ సవరణ బిల్లు 2024ను అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాలి
  • ప్రేమ, సోదరభావం, శాంతికి చిహ్నమే రంజాన్

పవిత్ర రంజాన్ పర్వదినాన్ని బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు ఆలింగం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు వక్ఫ్ సవరణ బిల్లు 2024కు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలో భాగంగా అనేక ప్రాంతాల్లో నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెంలో నిరసన తెలిపారు.. మతసామరస్యం వర్ధిల్లాలని, వక్స్ సవరణ బిల్లు 2024ని వ్యతిరేకించాలని, పాలస్తీనాలో గాజాపై యుద్ధాన్ని ఆపాలని నినాదాలు చేశారు. పలువురు ముస్లిం పెద్దలు మాట్లాడుతూ ప్రేమ, సోదరభావం, శాంతికి చిహ్నమే రంజాన్ పర్వదినమన్నారు.. చక్కగా వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. వక్ఫ్ సవరణ బిల్లు 2024ను వ్యతిరేకించాలని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *