సూళ్లూరుపేటలోని గ్రీవెన్స్ ద్వారా అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే విజయశ్రీ
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 85 అర్జీలు
- సూళ్లూరుపేట నియోజకవర్గంలోని గ్రీవెన్స్ ద్వారా అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే విజయశ్రీ
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువులోపు పరిష్కారం చూపాలని అధికారులకు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆదేశించారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే లో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొని ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇకపై గ్రీవెన్స్ డే ప్రతి బుధవారం జరుగుతుందన్నారు. ప్రజలందరూ ఈ గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ మేరకు వచ్చిన ప్రజల వద్ద నుంచి 85 అర్జీలను స్వీకరించినట్లు తెలిపారు. అర్జీదారులు అర్జీలు ఇచ్చిన వెంటనే సంబంధిత అధికారులకు పంపి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని పెండింగ్ ఉన్న అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి, పట్టణ కార్యదర్శి ఏజీ కిషోర్, వేమసాని శ్రీనివాసులు నాయుడు, అలవల శ్రీనివాసులు, తడ మండల టిడిపి నాయకులు బొమ్మన పలని, బొమ్మన శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.