కొంత మంది వ‌ల్ల అంద‌రికి చెడ్డ పేరు

ట్రాన్స్ జెండ‌ర్స్ కు ఎల్ల‌ప్పుడూ అందుబాటులో ఉంటాం

ట్రాన్స్ జెండ‌ర్స్ కు అవ‌గాహ‌న క‌ల్పించిన రూర‌ల్ సీఐ వేణు, ఎస్ఐ

కొంత మంది వ‌ల్ల అంద‌రికి చెడ్డ పేరు…

  • ట్రాన్స్ జెండ‌ర్స్ కు ఎల్ల‌ప్పుడూ అందుబాటులో ఉంటాం
  • ట్రాన్స్ జెండ‌ర్స్ కు అవ‌గాహ‌న క‌ల్పించిన రూర‌ల్ సీఐ వేణు, ఎస్ఐ

కొంత మంది ట్రాన్స్ జెండ‌ర్స్ వ‌ల్లే అంద‌రికి చెడ్డ పేరు వ‌స్తుంద‌ని…రూర‌ల్ సీఐ వేణు అన్నారు. ఇటీవ‌ల ట్రాన్స్ జెండ‌ర్స్ పై దాడులు, నేరాలు అధిక‌మ‌వుతున్న నేప‌థ్యంలో… సీఐ ఆధ్వ‌ర్యంలో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఐ, ఎస్ఐలు….వారికి ప‌లు సూచ‌న‌లు, స‌ల‌హాల‌తోపాటు జాగ్ర‌త్త‌లు కూడా తెలియ‌జేశారు. అనంత‌రం సీఐ వేణు మాట్లాడుతూ…తాడేప‌ల్లిగూడెం, అన‌కాప‌ల్లిలో ట్రాన్స్ జెండ‌ర్స్ పై దాడులు జ‌ర‌గ‌డం బాధాక‌ర‌మ‌న్నారు.మీరంద‌రూ స‌మాజంలో మంచిగా బ‌త‌కాల‌ని కోరారు. ట్రాన్స్ జెండ‌ర్స్ తామెప్పుడు అందుబాటులో ఉంటామ‌ని భ‌రోసా క‌ల్పించారు. అనంత‌రం ప‌లువురు ట్రాన్స్ జెండ‌ర్స్ మీడియాతో మాట్లాడారు. మ‌గ‌వారి మోసపూరిత ప్రేమ‌ల‌కి దూరంగా ఉండాల‌ని… వారి అబ‌ద్ధ‌పు ప్రేమల వ‌ల్ల కొంద‌రు ట్రాన్స్ జెండ‌ర్స్ చాలా ఇబ్బందులు ప‌డుతున్నార‌న్నారు. ఇలాంటి వాటికి తామంతా దూరంగా ఉండాల‌ని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *