హాస్పిటల్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రంగరామన్
నెల్లూరు మెడికవర్‌లో BMT చికిత్సలు విజయవంతం
- హాస్పిటల్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రంగరామన్
మహానగరాలలో మాత్రమే అందుబాటులో ఉన్న బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స నెల్లూరు జిల్లా ప్రజలకు కూడా చేరువ చేసేందుకు 2023 నవంబర్‌లో మెడికవర్ కాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ఈ విభాగాన్ని స్థాపించి విజయవంతంగా చికిత్సలు చేస్తున్నామని… మెడికల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్య నిపుణులు మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రంగరామన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్‌లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఇప్పటివరకు ఐదు ఆటోలోగస్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్సలను విజయవంతంగా పూర్తిచేసి వారిని డిశ్చార్జ్ చేయడం జరిగిందన్నారు. ఏ పరిస్థితుల్లో ఇటీవల ఒక రోగికి చ్చేసిన చికిత్స గురించి ఆయన మీడియాకు వివరించారు. జిల్లా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆసుపత్రి యాజమాన్యం చైర్మన్ డాక్టర్ అనిల్ కృష్ణారెడ్డి, డైరెక్టర్ హరికృష్ణ ల సహకారంతో మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో అన్ని విభాగాలతో సంసిద్ధంగా ప్రజల సేవలో ఉండేలా ఏర్పాటు చేశారన్నారు. ప్రతి బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్ ట్రీట్‌మెంట్ కి భయంపడకుండా మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్న వైద్య సేవలను వినియోగించుకోవాలని అయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మెడికవర్ హాస్పిటల్స్ సెంటర్ హెడ్ డాక్టర్ ధీరజ్ రెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ యశ్వంత్ రెడ్డి, పిఆర్ఓ చందు వర్మ, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.