వాటా కోసం తూటా

నెల్లూరులో ఓ కొడుకు బీభ‌త్సం

ఆస్తిలో వాటా కోసం అర్థ‌రాత్రి తండ్రి ఇంటి వ‌ద్ద బెదిరింపులు

ఇంటి త‌లుపుల‌ను బ‌ద్ద‌లు కొట్టే య‌త్నం

ఎవ‌రూ ప‌ట్టించుకోకపోవ‌డంతో లైసెన్స్‌డ్ గ‌న్‌తో ఓ రౌండ్ కాల్పులు

భ‌యాందోళ‌న‌కు గురైన స్థానికులు

కేసు న‌మోదుచేసిన చిన్న‌బ‌జారు పోలీసులు.

వాటా కోసం తూటా…!

  • నెల్లూరులో ఓ కొడుకు బీభ‌త్సం
    -ఆస్తిలో వాటా కోసం అర్థ‌రాత్రి తండ్రి ఇంటి వ‌ద్ద బెదిరింపులు
    -ఇంటి త‌లుపుల‌ను బ‌ద్ద‌లు కొట్టే య‌త్నం
    -ఎవ‌రూ ప‌ట్టించుకోకపోవ‌డంతో లైసెన్స్‌డ్ గ‌న్‌తో ఓ రౌండ్ కాల్పులు
    -భ‌యాందోళ‌న‌కు గురైన స్థానికులు
    -కేసు న‌మోదుచేసిన చిన్న‌బ‌జారు పోలీసులు

వ్యాపారంలో న‌ష్టాలొచ్చాయి.. ఆస్తిలో వాటాలు కావాల‌న్నాడు.. తండ్రి, సోద‌రులు స‌సేమిరా అన్నారు. త‌ర‌చూ గొడ‌వ‌లు.. బెదిరింపులు.. చివ‌ర‌కు ఆస్తి ఇస్తారా..? చ‌స్తారా..? అంటూ.. క్ష‌ణికావేశంలో.. విచ‌క్ష‌ణ కోల్పోయి.. తూటా పేల్చి.. బీభ‌త్స‌వం సృష్టించాడో.. కొడుకు.. చివ‌ర‌కు తండ్రి ఫిర్యాదుతో పోలీసుల‌కు చ‌క్కిన ఘ‌ట‌న నెల్లూరు న‌గ‌రంలో వెలుగులోకి వ‌చ్చింది. ఎన్న‌డూ లేనిది.. నెల్లూరులో ఈత‌ర‌హా గ‌న్ క‌ల్చ‌ర్‌.. ఆందోళ‌న‌కు గురి చేస్తోంది.

పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని ఆచారి వీధికి చెందిన రాజ్మాలైజైన్ కు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడు దిలీప్‌కుమార్ జైన్‌, మూడో కుమారుడు మ‌నోజ్‌కుమార్ జైన్ త‌ల్లిదండ్రులతో క‌ల‌సి ఉంటున్నారు. రెండో కుమారుడు హితేష్ కుమార్ జైన్ అలియాస్ జ‌తిన్. ఇత‌డికి పెళ్లి అయ్యాక‌.. శిఖ‌రంవారి వీధిలో వేరుగా ఉంటున్నాడు. తండ్రి అత‌డికి 40 ల‌క్ష‌లు వాటాగా ఇచ్చాడు. ఆ డ‌బ్బుతో బెంగ‌ళూరులో వేరుగా వ్యాపారం పెట్టుకున్నాడు. వ్యాపారంలో న‌ష్టాలు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత నెల్లూరు సుబేదారుపేట‌లో గ్లాస్ ఫ్లైవుడ్ దుకాణం పెట్టి.. అందులోనూ న‌ష్టాలు చ‌విచూశాడు. అప్ప‌టి నుంచి ఆస్తిలో వాటా కావాల‌ని.. గ‌త కొంత కాలంగా త‌ల్లిదండ్రులు, అన్న‌ద‌మ్ముల‌ను వేదిస్తున్నాడు. అప్పుడ‌ప్పుడూ వ‌చ్చి తండ్రితో గొడ‌వ ప‌డుతుండేవాడు.

ఈనెల 11వ తేదీకూడా వ‌చ్చి.. ఆస్తిపంప‌కాలు చేయాల‌ని.. లేదంటే.. త‌న వ‌ద్ద‌నున్న గ‌న్‌తో కాల్చుకుంటానంటూ బెదించాడు. పెద్ద‌లు జోక్యం చేసుకుని.. స‌ద్దుబాటు చేశారు. శ‌నివారం అర్థరాత్రి కొంద‌రు స్నేహితుల‌తో క‌ల‌సి వ‌చ్చి.. తండ్రి ఇంటి వ‌ద్ద నానా యాగీ చేశాడు. త‌లుపులు ప‌గ‌ల‌గొట్టే య‌త్నం చేశారు. ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో త‌న వ‌ద్ద నునున్న లైసెన్స్‌డ్ గ‌న్‌తో ఓ రౌండ్ త‌లుపుల‌పై కాల్చాడు. ఆ స‌మ‌యంలో అక్క‌డ ఎవరూ లేక‌పోవ‌డంతో ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు. దాంతో జ‌తిన్ కుటుంబ స‌భ్యులు ఎస్పీ కృష్ణ‌కాంత్‌కు ఫోన్‌లో స‌మాచారం అందించారు. అంతే.. ఎస్పీ ఆదేశాల‌తో.. చిన్న‌బ‌జారు పోలీసు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని.. జ‌తిన్‌, అత‌డితోపాటు ఉన్న ఐదుగురు స్నేహితుల‌ను అదుపులోకి తీసుకుని.. గ‌న్ ను స్వాదీనం చేసుకున్నారు. సీఐ కోటేశ్వ‌ర‌రావు చిట్టెం కోటేశ్వ‌రరావు కేసు న‌మోదు చేసి.. ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *