చిత్తూరులోని పలు మెడికల్ షాపుల్లో అధికారుల ఆకస్మిక తనిఖీలు
మెడికల్ షాపులపై విజిలెన్స్ దాడులు
- చిత్తూరులోని పలు మెడికల్ షాపుల్లో అధికారుల ఆకస్మిక తనిఖీలు
ఆపరేషన్ గరుడలో భాగంగా చిత్తూరు పట్టణంలోని…మెడికల్ షాపులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్, కెమిస్ట్ డ్రగిస్ట్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో నిషేధిత మందులను డాక్టర్ రసీదు లేకుండా విక్రయిస్తున్న మెడికల్ షాపులను గుర్తించి, సంబంధిత షాప్‌లలో విజిలెన్స్ అధికారి కరిముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. స్థానిక మురకంబట్టు సమీపంలోని మెడికల్ షాపుల్లో డాక్టర్ల రసీదులు, సరైన బిల్స్ లేకుండా మందులు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు షాపులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ దాడులలో డ్రగ్ ఇన్స్పెక్టర్ కీర్తన, లా&ఆర్డర్ ఇన్స్పెక్టర్ మహేశ్వర్, ఎస్.ఐ. అనిల్ కుమార్, విజిలెన్స్ ఇన్స్పెక్టర్ వెంకటరవి, EAGLE సిబ్బంది పాల్గొన్నారు.