మెడికల్ షాపులపై విజిలెన్స్, డ్రగ్స్ కంట్రోల్ అధికారుల ఆకస్మిక దాడులు
అధికారుల దాడులతో కంగుతిన్న దుకాణదారులు
నెల్లూరులో మత్తు పద్ధారాలు ఉన్నాయా…?
- మెడికల్ షాపులపై విజిలెన్స్, డ్రగ్స్ కంట్రోల్ అధికారుల ఆకస్మిక దాడులు
- అధికారుల దాడులతో కంగుతిన్న దుకాణదారులు
యువకులకు మత్తు పదార్ధాల అక్రమ అమ్మకాలను అడ్డుకోవాలంటూ ఉన్నతాధికారుల ఆదేశాలతో… నెల్లూరు జిల్లాలోని మెడికల్ షాపులపై…. విజిలెన్స్, డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. నగరంలోని పలు మెడికల్ షాపులలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. మత్తు పదార్ధాలు అక్రమ అమ్మకాలపై షాపుల నిర్వాహకుల్ని ఆరా తీశారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా మత్తు పదార్ధాలు విక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. విజిలెన్స్, డ్రగ్స్ కంట్రోలర్, పోలీసు శాఖ ఆకస్మిక తనిఖీలతో మందుల షాపు దుకాణ దారులు ఒక్క సారిగా కంగుతిన్నారు.