ఎగ్జామ్ సెంటర్ వద్ద విద్యార్థుల సందడి
కోవూరులో ప్రశాంతంగా పది పరీక్షలు…
- ఎగ్జామ్ సెంటర్ వద్ద విద్యార్థుల సందడి
నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో పది పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షా సమయానికి గంట ముందే విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్స్ కి చేరుకొన్నారు. దీంతో పరీక్షా కేంద్రం వద్ద సందడి వాతావరణం కనిపించింది. కోవూరులోని పరీక్షా కేంద్రాల్లో రెగ్యులర్ విద్యార్థులు 749 మంది, ఓపెన్ స్కూల్ విద్యార్థులు వంద మంది విద్యార్థులతో కలిపి మొత్తం 849 మంది విద్యార్థులు పది పరీక్షలు రాయనున్నట్లు అధికారులు ప్రకటించారు. విద్యార్థులకి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుంగా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.