కావలి వైపు నుంచి చెన్నై వైపు వెళ్తున్న ఓ లారీ
లారీ కారు ఢీ
మెడికవర్ హాస్పిటల్ వద్ద ప్రమాదం
నెల్లూరు నగరంలోని మెడికవర్ హాస్పిటల్ హైవే జంక్షన్ వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కావలి వైపు నుంచి.. చెన్నై వైపు వెళ్తున్న ఓ లారీ.. ముందు వెళ్తున్న కారును ఢీకొట్టడంతో కారు బాగా డ్యామేజీ అయ్యింది. ఆ లారీ ముందు వస్తున్న కారు.. ఆ జంక్షన్ వద్దకు రాగానే.. కనీసం సిగ్నల్స్ కూడా వేయకుండా.. చిల్డ్రన్స్ పార్కు వైపు తప్పేశాడు. వెనకాలే అదే వేగంతో వస్తున్న లారీ.. ఆ కారును ఢీకొట్టింది. దాంతో కొంత సమయం ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.