N3, యువకులకి కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు
బుడ్డోడు సేఫ్…
- తల్లిదండ్రుల చెంతకు మూడేళ్ల బాలుడు
- N3, యువకులకి కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు
నెల్లూరు నగరంలోని మనమసిద్ది నగర్ వద్ద నున్న సాయి భాస్కర్ స్కూల్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న మూడేళ్ల బాలుడు ఏడుస్తూ తరసపడ్డ ఘటనపై ఎన్3 న్యూస్‌లో అమ్మ కోసం ఆర్తనాదాలు అన్న కథనం ప్రసారమైన విషయం తెలిసిందే. స్థానిక యువకులు మూడేళ్ల బాలుడుని చిన్నబజారు పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న బుడ్డోడి తల్లిదండ్రులు స్టేషన్‌కు వద్దకు చేరుకొన్నారు. పోలీసులు విచారించి…ఆ బాలుడుని తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో ఆ తల్లిదండ్రులు తమ బిడ్డతో కలిసి స్థానిక యువకులైన చిన్న, చక్రి తోపాటు ఎన్3 న్యూస్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు.