ఎంపీటీసీ రాజాకి కోవూరు మండల ఎస్సీ ఎస్టీ నాయకులు హెచ్చరిక
రౌడీషీటర్.. నువ్వా.. వీరి చలపతిరావుపై విమర్శలు చేసేది..!
-ఎంపీటీసీ రాజాకి కోవూరు మండల ఎస్సీ ఎస్టీ నాయకులు హెచ్చరిక.
కోవూరు మండలంలోని స్థానిక వైయస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో కోవూరు మండల ఎస్సీ ఎస్టీ సెల్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ మెంబర్ సుబ్బరాయుడు మాట్లాడుతూ.. తమ నాయకుడు వీరి చలపతిరావుపై పలు విమర్శలు చేసిన ఎల్లాయపాలెం ఎంపీటీసీ గరికపాటి రాజా మాటలు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ప్రజలకు అభిమాన నాయకుడైన వీరి చలపతిరావుపై విమర్శ చేయడం మంచిది కాదని.. ఆయన్ను విమర్శించే స్థాయి మీది కాదన్నారు. ఒక రౌడీ షీటర్ అయిన నువ్వా.. మా వీరి చలపతిరావు గురించి మాట్లాడేది.. మరొకసారి ఆయన గురించి ఇలాంటి విమర్శలు చేస్తే తగిన గుణపాఠం చెప్తామని ఈసందర్భంగా ఆయన హెచ్చరించారు. అనంతరం వైసీపీ నాయకుడు మోషే మాట్లాడుతూ.. రైతుల సమస్యలపై పోరాటం చేస్తే.. మా నాయకుడి మీద లేని విమర్శలు తగదని అసభ్య పదజాలంతో చలపతిరావుని మాట్లాడితే నీకు సరైన బుద్ధి చెబుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ విభాగం నాయకులు శ్రీధర్, భాస్కర్, దామెర్ల మధు, జాషువా, కొండూరు వంశీ తదితర వైసిపి ఎస్సీ సెల్ మండల నాయకులు పాల్గొన్నారు.