నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేదేలేదు
సోమశిలలో పర్యటించిన ప్రాజెక్ట్ ఛైర్మన్ వేలూరు కేశవ చౌదరి
అలివి వలలతో వేట వద్దు
- నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేదేలేదు
- సోమశిలలో పర్యటించిన ప్రాజెక్ట్ ఛైర్మన్ వేలూరు కేశవ చౌదరి
నిషేధిత అలివి వలలతో జలాశయంలో వేట సాగిస్తే ఉపేక్షించేది లేదని సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ వేలూరు కేశవ చౌదరి అన్నారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిలలో బుధవారం ఆయన పర్యటించారు. అలివి వలలతో వేట చేసే వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక మత్స్యకారులు వేలూరు కేశవ చౌదరికి వినతి పత్రం అందజేశారు. అలివి వలలతో వేట సాగిస్తుండడంతో తమ జీవన ఉపాధి కోల్పోతున్నామని స్థానిక మత్స్యకారులు వేలూరు వద్ద తమ బాధను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వేలూరు కేశవ చౌదరి మాట్లాడుతూ.. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. అలాగే అలివి వలలు వేసే వారిపై చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తానని స్థానిక మత్స్యకారులకు హామీ ఇచ్చారు.