తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్
సంచలనం రేపిన ఘటన
సీసీ ఫుటేజ్ విడుదల చేసిన పోలీసులు
చిత్తూరులో దొంగలు పడ్డారు
-తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్
-సంచలనం రేపిన ఘటన
-సీసీ ఫుటేజ్ విడుదల చేసిన పోలీసులు
చిత్తూరు జిల్లాలో దొంగల ముఠాలు ప్రవేశించాయి.. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. ఇలా.. ఓ ఇంట్లో చోరీకి యత్నిస్తున్న వైనం.. సీసీ ఫుటేజ్లలో నిక్షిప్తం కావడంతో ఆ ఫుటేజీని చిత్తూరు టు టౌన్ సీఐ నెట్టి కంటయ్య మీడియాకు విడుదల చేశారు. మొత్తం ఆరు మంది ఓ ఇంట్లోకి వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తం అయ్యాయి. చిత్తూరులో దొంగలు హల్ ఛల్ చేస్తున్న ఘటనలపై సాక్షాత్తు సీఎం చంద్రబాబునాయుడు దృష్టిసారించారు. చిత్తూరులో చోరీలు జరక్కుండా తగిన చర్యలు తీసుకునేలా తగు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి మంగళగిరి నుంచి ప్రత్యేకంగా హెలికాఫ్టర్లో కొంత మంది ఆక్టోపస్ పోలీసులను చిత్తూరుకు పంపారు. స్థానిక పోలీసుల సమన్వయంతో ఈ దొంగలను పట్టుకునేపనిలో పడ్డారు అంతా..