న‌కిలీ స్కాన‌ర్ల స్కాం

జీ-పే, గూగుల్‌-పే స్కాన‌ర్ల మార్చేసి..

సినీ ఫక్కీలో దోచేసిన కేటుగాళ్లు

తడ మండలంలో స్కాన‌ర్ల దొంగల హల్‌ఛ‌ల్‌

పోలీసుల‌ను స‌వాల్ విసురుతున్న న‌యా మోస‌గాళ్లు

న‌కిలీ స్కాన‌ర్ల స్కాం..!!
-జీ-పే, గూగుల్‌-పే స్కాన‌ర్ల మార్చేసి..
సినీ ఫక్కీలో దోచేసిన కేటుగాళ్లు..

  • తడ మండలంలో స్కాన‌ర్ల దొంగల హల్‌ఛ‌ల్‌
    -పోలీసుల‌ను స‌వాల్ విసురుతున్న న‌యా మోస‌గాళ్లు

తిరుప‌తి జిల్లా.. సూళ్లూరుపేట నియోజ‌క‌వ‌ర్గంలో న‌కిలీ కేటుగాళ్లు చెల‌రేగిపోతున్నారు. దుకాణాలు, షాపుల వ‌ద్ద వ్యాపారులు ఏర్పాటుచేసే గూగుల్ పే, జీ పే స్కాన‌ర్ల స్థానంలో వారి ఖాతా స్కాన‌ర్ల‌ను అమ‌ర్చి డ‌బ్బు కాజేస్తున్న ముఠా వ్య‌వ‌హారం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. దీంతో వ్యాపారులు ల‌బోదిబో మంటూ.. పోలీసుల‌కు ఫిర్యాదుచేసినా.. వారిని ప‌ట్టుకోవ‌డంలో పోలీసులు విఫ‌మ‌వుతున్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్న వైనం ఇది..

తడ మండలంలోని బజారు సెంటర్, పరిసర ప్రాంతాల్లో గుర్తు తెలియని కేటుగాళ్లు దుకాణాల వద్ద ఉన్న ఫోన్ పే, గూగుల్ పే క్యూఆర్ కోడ్ స్కానర్లు మార్చి నగదును కాజేసిన ఘటన కలకలం రేపింది. జల్సాలకు అలవాటు పడి చెడ్డి గ్యాంగ్ దొంగలు అక్రమంగా చిరు వ్యాపారస్తుల స్కానర్లు స్థానంలో వాళ్ల స్కానర్లు పొందుపరిచి నగదు మొత్తం దోచేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. దుకాణదారుల నగదు లావాదేవీలు తమ ఫోన్ కు రాకపోవడంతో స్కానర్లు పరిశీలించారు. అయితే వాటిపై నకిలీ స్టిక్కర్లు ఉండటంతో మోసపోయామని గుర్తించారు. వెంటనే తడ పోలీసులకు తెలియజేశారు. వారు దుకాణాల వద్ద సీసీ కెమెరాలను పరిశీలించారు. పట్టుకోండి చూద్దాం అని సవాల్ విసిరిన ఈ స్కాన‌ర్ల స్కాం గ్యాంగ్ ను పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాల్ గా మారింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *